: టాస్ గెలిచిన కోల్ కతా...బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్
ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. చెరో మూడు మ్యాచులు ఆడిన కోల్ కతా, పంజాబ్ జట్లు చివరి మ్యాచుల్లో విజయం సాధించిన స్పూర్తితో గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. కోల్ కతా మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవగా, పంజాబ్ జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఒకదానిలో విజయం సాధించింది. జాగ్రత్తగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు మురళీ విజయ్ (13) నిలదొక్కుకోగా, వోహ్రా (8)ను మోర్కెల్ పెవిలియన్ కు పంపాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయిన పంజాబ్ జట్టు 26 పరుగులు చేసింది.