: గేల్ ను చూసి నేర్చుకో: వీరూకు వివ్ సలహా


ఇటీవల కాలంలో ఫామ్ లేక, పరుగులు రాక నానా తిప్పలు పడుతోన్న ఢిల్లీ స్టార్ వీరేంద్ర సెహ్వగ్.. గేల్ ను చూసి ఎలా ఆడాలో నేర్చుకోవాలని డేర్ డెవిల్స్ బ్యాటింగ్ సలహాదారు, అలనాటి విధ్వంసక బ్యాట్స్ మన్ వివియన్ రిచర్డ్స్ సలహా ఇచ్చాడు. సెహ్వాగ్ లో భారత క్రికెట్ కు మరికొంత కాలం సేవలందించే సత్తా ఉందని అభిప్రాయపడ్డ రిచర్డ్స్.. భారీ స్కోర్లు సాధించే విధంగా ఇన్నింగ్స్ ను ప్రణాళిక బద్ధంగా రూపుదిద్దుకోవాలని సూచించాడు. ఈ విషయంలో గేల్ దృక్పథం సెహ్వాగ్ కు ఓ పాఠంలా ఉపకరిస్తుందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News