: బ్రిటన్ రాణి విందుకు వెళ్లనున్న ఒబామా దంపతులు


బ్రిటన్ రాణి ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషెల్లీ పాల్గొననున్నారు. వచ్చే శుక్రవారం జరిగే ఈ వేడుకల్లో వారు పాల్గొంటారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. విండ్సర్ భవనంలో బ్రిటన్ రాణి ఇచ్చే గౌరవ విందుకు వారు హాజరవుతారని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, కెన్సింగ్టన్ ప్యాలెస్ లో యువరాజు విలియమ్ దంపతులను ఒబామా దంపతులు కలవనున్నట్లు ప్యాలెస్ అధికారులు ఒక ప్రకటన చేశారు. ఒబామా దంపతుల రాక కోసం ఎదురుచూస్తున్నామని, వారు ఆశ్చర్యపోయేలా అతిథి సేవలందించాలని అనుకుంటున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News