: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనే మా ప్రధాని అభ్యర్థి: లాలూ ప్రసాద్ యాదవ్
తదుపరి ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరు..? అనే విషయంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. తమ ప్రధాని అభ్యర్థి బీహార్ సీఎం నితీశ్కుమారేనని పేర్కొన్నారు. యూపీఏ, ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా జనతా పరివార్ మళ్లీ తెరపైకి వస్తోందన్న వార్తల నేపథ్యంలో లాలూ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆర్జేడీ, జేడీయూతో సన్నిహితంగా ఉంటోన్న కాంగ్రెస్ లాలూ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. బీజేపీ-సంఘ్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని వినిపిస్తోన్న ఎన్డీఏ యేతర పార్టీలు, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ఎంఐఎం నితీశ్‌కుమార్ ప్రధాని అభ్యర్థి అంశంపై ఎలా స్పందిస్తాయో చూడాలి.