: హస్తం గుర్తుకే మీ ఓటు: బాలీవుడ్ నటి అమీషా పటేల్
హస్తం గుర్తుకే మీ ఓటు వేయండంటూ బాలీవుడ్ తార అమీషా పటేల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. కోల్ కతాలోని నదియా జిల్లా రాణాఘాట్ నియోజకవర్గంతో పలు స్థానాలకు త్వరలో పోలింగ్ జరగనుంది. రాణాఘాట్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్న శంకర్ సింగ్ అక్కడి యువత ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఆమెతో కలిసి ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. అమీషా పటేల్ ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన లభించింది. కాంగ్రెస్ తరఫున ఆమె మరిన్ని ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది.