: బెంగళూరు ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం... కొత్త పీఎఫ్ విధానం నిలిపివేత!


గార్మెంట్స్ సంస్థల్లో పని చేసే కార్మికులు చేసిన ఆందోళనతో కేంద్రం దిగివచ్చింది. తక్షణం కొత్త పీఎఫ్ విధానం అమలులోకి వస్తుందని గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. జూలై 31 వరకు కొత్త పీఎఫ్ విధానం అమలులోకి రాదని ప్రకటించింది. అలాగే 58 ఏళ్లు దాటిన వారు మాత్రమే పీఎఫ్ ఖాతాల నుంచి నగదు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బెంగళూరులో నెలకొన్న ఆందోళనలు తగ్గుముఖం పడతాయని కేంద్రం భావిస్తోంది. కాగా, గార్మెంట్స్ కార్మికులు చేపట్టిన ఆందోళనతో బెంగళూరు అట్టుడికిపోయింది. వేలాదిగా తరలిన కార్మికులు వాహనాలు ధ్వంసం చేసి, పోలీసులపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News