: కోహినూర్‌ను వెనక్కి రప్పించాల్సిందే: ఆరెస్సెస్


కోహినూర్ వజ్రంపై రాజుకున్న వివాదాలకు భారత ప్రభుత్వం తెర‌దించుతూ.. కోహినూర్ వజ్రాన్ని భారత్‌ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్‌డమ్‌ను బలవంతపెట్టలేమని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని కేంద్రం దేశ అత్యున్న‌త‌ న్యాయస్థానానికి విన్నవించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆరెస్సెస్‌) కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను విమర్శించింది. కోహినూర్ వజ్రం దేశ సంపద అని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ అన్నారు. దానిని భార‌త దేశానికి వెనక్కి తీసుకురావాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News