: హెలికాఫ్టరులో విహరించిన 102 ఏళ్ల బామ్మగారు!
హెలికాఫ్టర్ లో ప్రయాణం చేయాలన్న 102 సంవత్సరాల బామ్మగారి చిరకాల కోరికను ఆమె కొడుకు తీర్చాడు. తన తల్లి పుట్టినరోజు కానుకగా ఆమెను హెలికాఫ్టర్ లో ఎక్కించి తిప్పాడు. థానేకు చెందిన బామ్మ గారు వితాభాయ్ కు 14 మంది పిల్లలు. అయితే, ప్రస్తుతం జీవించి ఉన్నది మాత్రం ఆరుగురే. ఆమెకు ఎప్పటి నుంచో హెలికాఫ్టర్ ఎక్కాలన్నది కోరిక. వితాభాయ్ పుట్టినరోజు వేడుకను వెరైటీగా నిర్వహించడంతోపాటు, ఆమె చిరకాల కోరికను తీర్చాలనుకున్నాడు. తల్లితో పాటు కుటుంబసభ్యులందరూ కలిసి హెలికాఫ్టర్ ఎక్కారు. హెలికాఫ్టరు దిగిన అనంతరం వితాభాయ్ మాట్లాడుతూ, ఆకాశంలో తిరగడం చాలా ఆనందంగా ఉందని, పై నుంచి భూమిని చూస్తుంటే చెప్పలేని అనుభూతి కలిగిందని సంతోషంగా చెప్పింది.