: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌పై ప్రసవించిన మహిళ
ఓ మహిళ ఫుట్‌ఫాత్‌పైనే ప్రసవించిన సంఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడలో చోటుచేసుకుంది. అక్కడి ఓ సినిమా థియేటర్‌కు సమీపంలో ఫుట్‌ఫాత్‌పై మహిళ తీవ్ర నొప్పులతో బాధ పడుతుండగా గమనించిన నారాయణగూడ మహిళా పోలీసులు ప్రసవం కోసం అక్కడే తగు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం దగ్గరలోని ఆసుపత్రికి తల్లీశిశువులను తరలించారు. ఈ విషయం పట్ల పోలీసులు చూపిన చొరవను స్థానికులతో పాటు పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు.