: బీజేపీ ఎంపీ చెంప ఛెళ్లుమనిపించిన యువకుడు
రాజస్థాన్ కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడుని ఒక యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. బార్మెర్ లో ఈరోజు జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి ఎంపీ సొనారామ్, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇదే వివాహానికి ఒక యువకుడు ఖర్తారామ్ కూడా హాజరయ్యాడు. సదరు ఎంపీ వద్దకు వచ్చిన ఖర్తారామ్ ఒక విషయమై మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. దీంతో నిగ్రహం కోల్పోయిన ఖర్తారామ్, బీజేపీ ఎంపీ చెంప ఛెళ్లుమనిపించాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ పారిస్ దేశ్ ముఖ్ చెప్పారు. ఈ సంఘటనపై ఎంపీ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఖర్తారామ్, అతని స్నేహితుడు ప్రేమరామ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.