: మా అమ్మతో నేనిలా..: జగన్


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ జగన్ తల్లి విజయమ్మ 60వ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈ ఉదయం ఇంట్లోనే జరిగిన వేడుకల్లో తల్లికి శుభాకాంక్షలు చెప్పిన జగన్, ఆమెకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా తల్లి ఆశీర్వచనం తీసుకున్న ఆయన, ఆ చిత్రాలను సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోని తన ఖాతాలో పోస్ట్ చేశారు. 'మా అమ్మ 60వ పుట్టినరోజును ఇలా జరుపుకున్నాం' అని క్యాప్షన్ కూడా పెట్టారు. జగన్ ను ఆప్యాయంగా ముద్దాడిన విజయమ్మ కొడుకుకు తన ఆశీస్సులు అందించారు. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News