: రోజా ఏమాత్రమూ మారలేదు: బొండా ఉమ
ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండయినా, వైకాపా ఎమ్మెల్యే రోజా తీరు మారలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ విమర్శించారు. ఆమె తన మాట తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికారు. భోగాపురం విమానాశ్రయం, బందర్ నౌకాశ్రయాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన, జోన్ తెప్పించేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని, త్వరలోనే జోన్ వస్తుందని అన్నారు.