: బెంగళూరు అష్టదిగ్బంధనం...కార్మికుల రణరంగం...పోలీసులపై దాడులు


బెంగళూరు మహా నగరం గార్మెంట్స్ కార్మికుల అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది. పీఎఫ్ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేసిన కార్మికులు రోడ్డెక్కారు. బెంగళూరు శివార్లలో గార్మెంట్స్ సంస్థలు పెద్దఎత్తున విస్తరించి ఉండడంతో ఆయా సంస్థల్లో పని చేసే కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా, కార్మికులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అంతే, ఆందోళన కారులు రెచ్చిపోయారు. పోలీసులకు ఎదురు తిరిగారు. దొరికిన పోలీసును దొరికినట్టు చితకబాదారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లో ఉన్న వాహనాలపై విరుచుకుపడ్డారు. వాటిని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో కమిషనర్ కు కూడా గాయాలయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అదనపు బలగాలను తరలించిన పోలీసులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News