: బాలీవుడ్ హాట్ ప్రేమ జంట బ్రేకప్
బాలీవుడ్ యువ ప్రేమ జంట సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ ల మధ్య కలహాలు చెలరేగాయని, దీని కారణంగా వారిద్దరూ విడిపోయారంటూ బాలీవుడ్ గుప్పుమంటోంది. వివరాల్లోకి వెళ్తే...'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. అలియాకు అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే కాల క్రమంలో మాజీ ప్రియుడికి దూరమైన అలియా, సిద్ధార్థ్ కి దగ్గరైంది. తాజాగా నిర్మాత మన్మోహన్ శెట్టి కుమార్తె ఆర్తీ శెట్టి బర్త్ డే పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ పార్టీకి అలియా మాజీ ప్రియుడు అలీ దడార్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలియాతో అలీ సన్నిహితంగా ఉండడం సిద్ధార్థ్ కి నచ్చలేదు. ఇదే విషయం అక్కడే అందరి ముందు చెప్పేశాడు. దీంతో పెద్ద వివాదం రేగింది. ఆ తరువాత వీరిద్దరూ కలుసుకోలేదు. తాజాగా దర్శకుడు కరణ్ జోహర్ నివాసానికి కూడా వీరిద్దరూ వేర్వేరుగా వెళ్లడం విశేషం. అయితే కరణ్ జోహర్ వీరిని కలిపాడో లేదో తెలియలేదు.