: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎం ఫడ్నవీస్
వర్షాభావం వల్ల మహారాష్ట్రలో తీవ్ర కరవు ఏర్పడిన సంగతి తెలిసిందే. లాతూరు లాంటి ప్రాంతాలకు రైళ్లలో నీటిని పంపాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఆ వసతి కూడా లేదు. బావులు, చెరువులు ఎండిపోయి అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కరవు పరిస్థితులపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించాడు. కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జలయుక్త్ శివార్ అభియాన్’ కార్యక్రమానికి 50లక్షల రూపాయలు విరాళం ప్రకటించి రియల్‌హీరో అనిపించుకున్నాడు. కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పాడు. ‘జలయుక్త్ శివార్ అభియాన్’ కార్యక్రమంలో అక్కడి నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రయత్నానికి చేయూతనిచ్చిన అక్షయ కుమార్‌కు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం ద్వారా రానున్న వర్షాకాలంలో నీటిని నిల్వ చేసేందుకు చెరువులు, డ్యామ్ లు నిర్మించనున్నారు.