: ప్రజాస్వామ్య మూలాలనే పెకిలిస్తున్న మోదీ సర్కారు: హైకోర్టు కఠిన వ్యాఖ్య
ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం నిబంధనలకు అనుగుణంగా సాగలేదని, కేంద్ర ప్రభుత్వం చర్య ప్రజాస్వామ్యాన్ని పెకిలించేలా సాగుతోందని ఆ రాష్ట్ర హైకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసింది. "ఈ తరహా వివాదాలు వచ్చిన వేళ, మధ్యస్తంగా ఉండాల్సిన మీరు (కేంద్రం) ఇలా రాష్ట్రపతి పాలన దిశగా సాగివుండాల్సింది కాదు" అని సీఎం పదవిని వీడిన హరీశ్ రావత్ వేసిన రిట్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం పేర్కొంది. అంత హడావుడిగా ప్రభుత్వాన్ని సస్పెన్షన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని, దీంతో రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి పనులూ ఆగిపోయాయని, ఇందుకు ఎవరిని నిందించాలని ప్రశ్నించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిషత్ లతో కూడిన ధర్మాసనం, ఓట్ల డివిజన్ పై స్పీకర్ వైఖరిని సైతం ప్రశ్నించింది. మార్చి 28న రావత్ కు బలనిరూపణకు అవకాశం ఇచ్చి వుండాల్సిందని అభిప్రాయపడింది.