: పోచారం శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం!... అగ్రి వర్సిటీలో మంత్రిని అడ్డుకున్న విద్యార్థులు


టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి కొద్దిసేపటి క్రితం చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదులోని రాజేంద్ర నగర్ పరిసరాల్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లిన మంత్రిని అక్కడి విద్యార్థులు అడ్డుకున్నారు. వర్సిటీ ప్రధాన గేటు వద్దే మంత్రిని అడ్డుకున్న విద్యార్థులు... ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలిపారు. ఖాళీగా ఉన్న సర్కారీ ఉద్యోగాలన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను తక్షణమే నిలిపివేయాలని కోరారు. వెటర్నిటీ వైద్యుల ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News