: రండి సరిహద్దు గీత గీసుకుందాం: చైనాకు భారత్ ఆఫర్


భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోవాలంటే, రెండు దేశాల మధ్యా ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ - వాస్తవాధీన రేఖ) గీసుకుందామని భారత్ కోరింది. ఇరు దేశాల అధికారులూ కలిసి హద్దులను నిర్ణయించాలని, అందుకు సహకరించాలని చైనా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్, చైనా రక్షణ మంత్రి చాంగ్ వాంక్వాన్ తో జరిపిన చర్చల్లో కోరారు. సరిహద్దులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అయితే, ఎల్ఏసీని నిర్ణయించడానికి ఎటువంటి సమయాన్నీ నిర్దేశించుకోలేదని చాంగ్ తో జరిపిన చర్చల అనంతరం పారికర్ చైనాలోని భారత మీడియాకు తెలిపారు. "ఇందుకు సమయాన్ని నిర్దేశించుకోవడం చాలా కష్టం. ఇరు దేశాల మధ్యా మంచి సంబంధాలు ఉన్న కారణంగా ముందడుగు పడుతుందని మాత్రం చెప్పగలను" అని ఆయన అన్నారు. మసూద్ అజర్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు తాను వెల్లడించానని అన్నారు. దక్షిణ చైనా విషయంలో భారత వైఖరిని చైనా ప్రశ్నించిందని, ఈ విషయంలో ఇండియా ఆలోచనలను వారితో పంచుకుని, వారి అనుమానాలను నివృత్తి చేశామని పారికర్ తెలియజేశారు. చైనా, పాక్ ల మధ్య సిల్క్ బార్డర్, ప్రత్యేక సెజ్ రహదారి వంటి విషయాలనూ ప్రస్తావించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News