: డప్పు కొట్టి దరువేసిన చంద్రబాబు... గిరిజనులతో కలిసి సందడి చేసిన ఏపీ సీఎం


ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం సందడి చేశారు. డప్పు భుజానికి తగిలించుకుని దరువేసిన చంద్రబాబు... గిరిజన మహిళలతో కలిసి ఆదివాసీ తరహా నృత్యాలు చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు డప్పు చేతబట్టారు. అక్కడి కళాకారుల సూచనలతో కొద్దిసేపు దరువేశారు. ఆ తర్వాత గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో సదస్సుకు హాజరైన కళాకారులతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు.

  • Loading...

More Telugu News