: కింకర్తవ్యం!... లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ భేటీలో పార్టీ ఫిరాయింపులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టిన నేపథ్యంలో... వారిపై చర్యల కోసం ఏ దిశగా అడుగు వేయాలన్న అంశంపై పార్టీ నేతల నుంచి జగన్ సలహాలు తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో తాను చేపట్టబోయే యాత్రకు సంబంధించి కూడా ఈ భేటీలోనే ఓ ప్రణాళికను ఆయన రూపొందించుకోనున్నట్లు సమాచారం.