: ఈక్వెడార్‌ భారీ భూకంపంలో 413కు చేరిన మృతుల సంఖ్య‌


ఈక్వెడార్‌లో శనివారం రాత్రి 7.8తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 413కి పెరిగినట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈక్వెడార్‌ రాజధాని క్వీటోలో సంభ‌వించిన ఈ భూప్రకంప‌నల్లో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్ర‌క‌టించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆ దేశ ప్ర‌భుత్వం తెలిపింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది.

  • Loading...

More Telugu News