: మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!...ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ఈడీ యత్నాలు
బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ముంబై కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అంతకుముందే మాల్యా పాస్ పోర్టును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసిన విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎలాగైనా మాల్యాను దేశానికి రప్పించాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్న ఈడీ... తాజాగా ఇంటర్ పోల్ ద్వారా మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ దిశగా నిన్ననే చర్యలు మొదలుపెట్టిన ఈడీ... త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయించనుంది. ఇదే జరిగితే లండన్ లోనే కాదు కదా... ప్రపంచంలో ఏ మూల దాగి ఉన్నా మాల్యా దేశానికి రాక తప్పదు.