: కర్ణాటక సీఎంగా మల్లికార్జున ఖర్గే?... సిద్దరామయ్యకు స్థానచలనం తప్పదంటున్న పార్టీ వర్గాలు


లోక్ సభలో విపక్ష నేత హోదాలో ఉన్న మల్లికార్జున ఖర్గే త్వరలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు. ఖరీదైన హాబ్లెట్ వాచీ పెట్టుకుని కనిపించిన ప్రస్తుత సీఎం సిద్దరామయ్య పెను వివాదంలోనే చిక్కుకున్నారు. రోజుల తరబడి నడిచిన ఈ వివాదం... ముఖ్యమంత్రి తన వాచీని రాష్ట్ర ఖజానాకు ఇచ్చేయడంతో ముగిసింది. ఈ క్రమంలో ఆయన తీరుపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పిలిపించి మరీ అక్షింతలు వేసినట్లు నాడు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో దక్షిణాదిలో తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఖర్గేకు సీఎం పీఠం అప్పగించి పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఖర్గేను సీఎంగా ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మేరకు కర్ణాటక సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఖర్గేకు అధిష్ఠానం చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News