: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ నిన్న హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చారు. తన జట్టు ఆడుతున్న మ్యాచ్ కోసం హైదరాబాదు వచ్చిన ఆమె నిన్న రాత్రి నేరుగా ఎల్లమ్మ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎంవీ శర్మ... నీతా అంబానీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను నీతాకు అందజేశారు.