: చైనా అంటే భయమెందుకు?: కేంద్రానికి ములాయం సూటి ప్రశ్న


సరిహద్దులు దాటి చైనా.. భారత భూభాగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కేంద్రంపై ధ్వజమెత్తారు. చైనా అంటే ఎందుకు భయపడుతున్నారని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. నేడు ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. 'దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. ఓ వైపు నిరుద్యోగం తాండవిస్తోంది. మరోవైపు ధరలు చుక్కలనంటుతున్నాయి. తాజాగా సరిహద్దుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో చైనాను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? చైనా ప్రధాన లక్ష్యం భారతే అని గత ఎనిమిదేళ్ళుగా చెబుతున్నాను. అసలు భారత నిఘా వర్గాలు, విదేశాంగ మంత్రి ఏం చేస్తున్నట్టు?' అని ప్రశ్నించారు.

చైనాను తరిమికొట్టే సత్తా ప్రభుత్వానికి లేదని ములాయం దుయ్యబట్టారు. ఎట్టకేలకు ఓ మంత్రి చైనాను వేడుకొనేందుకు వెళ్ళారని ఎద్దేవా చేశారు. భారత సైన్యం బలహీనంగా లేకున్నా, దాడులకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందో అర్థం కావడంలేదని ములాయం వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News