: బౌలర్లు ఆకట్టుకున్నారు...బ్యాట్స్ మన్ రాణిస్తే తొలి విజయం


ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా ఉప్పల్ వేదికగా ప్రారంభమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లు ఆకట్టుకున్నారు. బ్యాట్స్ మన్ రాణిస్తే, ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సన్ రైజర్స్ హైదరాబాదు తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు ఆదిలోనే గుప్టిల్ (2), పార్థివ్ పటేల్ (10) వికెట్లను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (5) రనౌట్ కావడంతో ముంబై ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత బట్లర్ (11) కూడా వెనుదిరగడంతో లోకల్ బోయ్ అంబటి రాయుడు (51) నిలదొక్కుకుని ఆకట్టుకున్నాడు. అతనికి హార్డిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య (49) ధాటిగా ఆడుతూ అభిమానులను అలరించాడు. హార్డిక్ పాండ్య (2) తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు 142 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లలో మూడు వికెట్లతో శ్రాన్ రాణించగా, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. 143 పరుగులతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News