: గాజువాక పోలీస్ స్టేషన్లో రోజాపై ఫిర్యాదు


చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై విశాఖపట్టణంలోని గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుని అవమానపరిచేలా ఆమె ప్రసంగాలు ఉన్నాయని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ నుంచి రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం, దానిని సవాల్ చేస్తూ ఆమె కోర్టుకు వెళ్లడం తెలిసిందే. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు నిచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేయగా సర్కార్ కు అనుకూలంగా తీర్పు రావడం, దానిపై రోజా సుప్రీం కోర్టుకి వెళ్లడం తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News