: విగ్రహాలకు మాస్కులు...వినూత్నంగా నిరసన
ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతి సంవత్సరం కాలుష్య నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. దీంతో గ్రీన్ పీస్ కార్యకర్తలు లండన్ లో పెరిగిపోతున్న కాలుష్యంపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ బయట ఉన్న క్వీన్ విక్టోరియా, విన్ స్టన్ చర్చిల్, నెల్సన్ స్తంభంతో పాటు 17 ప్రముఖ విగ్రహాలకు గ్రీన్ పీస్ కార్యకర్తలు మాస్కులు తొడిగారు. దీంతో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.