: ముంబై ఓపెనర్లను పెవిలియన్ కు పంపిన భువీ, శ్రాన్


ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా ఉప్పల్ వేదికగా ప్రారంభమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లు ఆకట్టుకున్నారు. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి, ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. గుప్టిల్ (2) ను భువనేశ్వర్ అవుట్ చేయగా, పార్థివ్ పటేల్ (10)ను బరిందర్ శ్రాన్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (5) కు లోకల్ బోయ్ అంబటి రాయుడు (23) జత కలిశాడు. వీరిద్దరూ కుదురుకోవడంతో ముంబై దూకుడుగా ఆడుతోంది. దీంతో 7 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు 43 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లలో భువనేశ్వర్, శ్రాన్ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News