: నిజంగా తనను కొట్టినా పూరీది కేసు పెట్టే మనస్తత్వం కాదు!: తమ్మారెడ్డి


నిజంగా వెళ్లి తనను కొట్టినా కూడా కేసు పెట్టకూడదని అనుకునే మనస్తత్వం గల వ్యక్తి దర్శకుడు పూరీ జగన్నాథ్ అని, మరి, అటువంటి ఆయన పోలీస్ స్టేష న్ కు వెళ్లి కేసు పెట్టాడంటే కొంచెం ఆశ్చర్యంగా ఉందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. పూరీ ఇంటిపైకి లోఫర్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు వెళ్లి దాడి చేస్తే కనుక వారిది తప్పని, ఒకవేళ అలా జరగని పక్షంలో పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు పెట్టిన పూరీది తప్పని అన్నారు. ఏదేమైనా కానీ, ఛాంబర్ దగ్గరో, డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ వద్దో తేల్చుకోవాలి కానీ, రచ్చకెక్కడం చాలా సిగ్గు పడాల్సిన విషయమని తమ్మారెడ్డి అన్నారు. ఈ అంశంతో ఫ్యాన్స్ కు అసలు సంబంధం లేదని అన్నారు. పూరీ జగన్నాథ్ కేసు పెట్టడమే తప్పని అంటుంటే, ఇంకా ఫ్యాన్స్ మాట్లాడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ‘నాకు ఏదైనా జరిగితే నేను కేసు పెట్టాలి కానీ, నన్ను అభిమానించే వాళ్లు కేసు పెడతానంటే ఎట్లా కుదురుతుంది? అది కరెక్టు పద్ధతి కాదు’ అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News