: జపాన్ లో మళ్లీ భూకంపం


జపాన్ ను భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారంలో మూడుసార్లు జపాన్ ను పలకరించిన భూకంపాలు, ఈ రోజు మళ్లీ జపాన్ వాసులను ఆందోళనలో నెట్టాయి. తాజాగా, జపాన్ లోని కుమమొటో ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. గత వారం సంభవించిన మూడు భూకంపాల కారణంగా 42 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News