: డబ్బుల విషయంలో దర్శకుడికి, డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి సంబంధముండదు: తమ్మారెడ్డి భరద్వాజ
దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అసలు దాడి ఎందుకు జరిగిందో తెలియడం లేదని ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. డబ్బుల విషయం నిర్మాతకు సంబంధం ఉంటుంది తప్పా దర్శకుడికి ఎటువంటి సంబంధమూ ఉండదని అన్నారు. మరి, పూరీ జగన్నాథ్ పై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని అన్నారు. అంతేకాకుండా, డిస్ట్రిబ్యూటర్లపై పూరీ జగన్నాథ్ ఎందుకు కేసు పెట్టారో తెలుసుకోవాల్సిన అవసరముందని అన్నారు. కాగా, లోఫర్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేశారంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆరోపించిన విషయం తెలిసిందే.