: ముహూర్తం కుదిరింది...20న టీడీపీలో చేరనున్న వైఎస్సార్సీపీ నేతలు
విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు టీడీపీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది. బొబ్బిలి శాసన సభ్యుడు సుజయకృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బేబీనాయన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 20న టీడీపీలో అధికారికంగా చేరుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే వీరిద్దరే చేరుతున్నారా? లేక వీరికి సన్నిహితులైన కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలను కూడా తమతో పాటు తీసుకెళ్తున్నారా? అన్న విషయాలను వీరు బయటపెట్టలేదు. జిల్లాలో మాత్రం వీరు నలుగురూ పార్టీ మారుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అదే జరిగితే...విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని చెప్పచ్చు. బొత్స ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన విజయం సాధించకపోవడంతో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యతా దక్కే అవకాశం కనబడడం లేదు. పార్టీ మారినవారంతా ఆయనపై వ్యతిరేకత కారణంగా పార్టీ మారుతున్న సంగతి తెలిసిందే.