: హంద్వారాలో మళ్లీ ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు
ఓ బాలికపై భద్రతా బలగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డాయంటూ జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తనపై వేధింపులకు పాల్పడిన వారు ఆర్మీ జవాన్లు కాదని సదరు బాలిక వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చల్లబడలేదు. ఈరోజు మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. హంద్వారాలో మళ్లీ నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. వదంతులు చెలరేగకుండా, ప్రశాంత వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై విధించిన నిషేధాన్ని ఈరోజు ఉదయమే ఎత్తివేసిన సంగతి తెలిసిందే.