: పూరీ జగన్నాథ్ ఇంట్లో కెళ్లాలంటే మూడంచెల భద్రతను దాటుకెళ్లాలి... దాడి ఎలా సాధ్యం?: డిస్ట్రిబ్యూటర్లు


పూరీ జగన్నాథ్ ఇంట్లోకెళ్లాలంటే ముందుగా గేటు దగ్గర సెక్యూరిటీని దాటుకుని వెళ్లాలి, తరువాత బౌన్సర్లను దాటుకెళ్లాలి, ఆ తరువాత ఆయన వ్యక్తిగత గన్ మన్ ను దాటుకుని వెళ్లాలి. కనీసం ఆయన ఇంట్లో లిఫ్ట్ ఎక్కాలన్నా బౌన్సర్ దాని డోర్ ఓపెన్ చేస్తేనే అతని ఇంట్లోకి వెళ్లగలమని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. అదంతా ఒక ఎత్తైతే... ఆయన నివాసంలో సీసీ కెమెరా నిఘా ఉందని వారు చెప్పారు. ఇన్నింటి మధ్య పూరీ జగన్నాథ్ ఇంటికి వెళ్లి, ఫిజికల్ హేండీకాప్డ్ అయిన డిస్ట్రిబ్యూటర్ రాందాసు ఆయనపై ఎలా దాడి చేస్తారని వారు ప్రశ్నించారు. ఒకవేళ ఆయన నిజంగా దాడి చేసి ఉంటే, ఆ ఇంటి నుంచి బయటకు రాగలిగి ఉండేవారా? అని వారు నిలదీశారు. అదీ కాక తమతో ఏదైనా సమస్య ఉంటే...నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలా పలు సంఘాలు ఉన్నాయని, వీటన్నింటినీ వదిలేసి, పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. పూరీ జగన్నాథ్ తమపై ఆరు కేసులు పెట్టారని వారు తెలిపారు. 'హార్ట్ ఎటాక్' సినిమా సర్టిఫికేట్ కోసం తాము సహాయం చేశామని వారు చెప్పారు. పూరీ జగన్నాథ్ తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. అయితే చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూస్తాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News