: తిరుమలలో మెగాస్టార్ దంపతులు
తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. అంతకుముందు ఆలయ పూజారులు చిరంజీవి దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తన రెండో కూతురు శ్రీజ వివాహమైతే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామని, మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకున్నామన్నారు. అందుకే, శ్రీవారి దర్శనార్థం ఇక్కడికి వచ్చామని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, చిరంజీవి దంపతులతో పాటు శ్రీజ దంపతులు కూడా ఉన్నారు.