: సరైన వసతులు లేవు.. కాన్పూర్ లో ఒక ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే జరుగుతుందట!
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మ్యాచ్ మాత్రమే జరగనుంది. ముందుగా నిర్ణయించిన మేరకు మే19, మే21 తేదీల్లో అక్కడ రెండు మ్యాచులు నిర్వహించాల్సి ఉంది. అయితే రవాణా, హోటల్ గదుల సమస్యలతో అక్కడ ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్ణయించిన మేరకు మే 19న గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ మాత్రమే కాన్పూర్ గ్రీన్‌పార్క్ మైదానంలో జరుగుతుంది. మే 21న ఈ మైదానంలోనే నిర్వహించాలనుకున్న మరో మ్యాచ్‌ను వేరే చోటుకి తరలించనున్నట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.