: మన దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉండే టాప్-5 రిజర్వ్ లు ఇవే!


ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొన్ని దశాబ్దాలుగా పులుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. కానీ, ఈ ఏడాది గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పులుల జనాభా సుమారు 22 శాతం పెరిగింది. ఈ వార్తతో వన్య ప్రాణుల ప్రేమికులు చాలా సంతోషిస్తున్నారు. 2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య, ఈ ఏడాదిలో 3,890కు పెరిగింది. ఈ ఘనత అంతా టైగర్ కన్జర్వేషన్ విభాగానికి చెందుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పులుల సంరక్షణకు గాను తీసుకున్న చర్యల కారణంగానే వాటి సంఖ్య పెరిగిందని అంటున్నారు. పులుల సంరక్షణ వ్యవహారంలో గవర్నమెంటుతో పాటు నాన్- గవర్నమెంట్ రంగాలకు చెందిన వారి పాత్ర కూడా ఉంది. పులుల సంఖ్య పెరగడం ద్వారా ఎకో- సిస్టమ్ లో మంచి మార్పులు సంభవించడమే కాకుండా, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే, మన దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉండే టాప్-5 టైగర్ రిజర్వ్ లు ... * టడోబా అంథారి టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర * పెంచ్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ * బందీపూర్ నేషనల్ పార్క్, కర్నాటక * పన్నా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ * నాగర్హోల్ నేషనల్ పార్క్, కర్నాటక

  • Loading...

More Telugu News