: పెళ్లికాని అమ్మాయిలు ఈ మాటలు వినీవినీ విసిగిపోతారట!
పెళ్లికాని అమ్మాయిలు, ముఖ్యంగా 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెళ్లికాని అమ్మాయిల విషయానికొస్తే.. వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి తరచుగా కొన్ని వాక్యాలు వినీవినీ వారు విసుగెత్తిపోతారట. ఆ వాక్యాలు తమకు వినిపించకుండా ఉంటే బాగుంటుందని ఇలాంటి అమ్మాయిలు కోరుకుంటారుట. ఆ వాక్యాలు ఏమిటంటే... * కెరీర్ ఓరియంటెడ్ గా ఉండద్దు * ఎక్కువగా ఆలోచించకుండా తొందరగా పెళ్లి చేసుకో (27 సంవత్సరాల కంటే ఎక్కువ వయ్ససుంటే కనుక) * పెళ్లి చేసుకోకుండా ఉండే అమ్మాయిలు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోలేరు. అల్లుడుంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనవళ్లు లేదా మనవరాళ్లు ఉంటే బాగుంటుంది. * ఏమీ బాధపడవద్దు, దేవుడు అంతా మంచి జరిగేలా చూస్తాడు. * కొంచెం ఆలస్యంగానైనా కెరీర్ ప్రారంభించుకోవచ్చు. కానీ, తొందరగా పిల్లలు పుట్టకపోతే చాలా కష్టం. వయస్సు పైబడిన తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి... అనే వాక్యాలు తమ పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు చెబుతూ ఉంటారుట. ఇవే వీరిని ఇబ్బంది పెడుతున్నాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు.