: వ‌చ్చే ఏడాది అయోధ్య రామ‌మందిరంలో శ్రీ‌రామన‌వ‌మి వేడుక‌లు: సుబ్ర‌హ్మ‌ణ్యస్వామి


అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం ఈ ఏడాది చివ‌ర్లో ప్రారంభమ‌వుతుంద‌ని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఇక వచ్చే ఏడాది హిందువులు శ్రీరామనవమి వేడుకలు అయోధ్య‌లోని రామ‌మందిరంలోనే జరుపుకుంటారని పేర్కొన్నారు. ముంబైలో విరాట్ హిందూస్థాన్ సంగం నిర్వహించిన 'రామ మందిరం ఎందుకు? ఎలా' అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. సుప్రీంకోర్టు నుంచి అనుమతి వ‌చ్చిన వెంట‌నే రామ మందిర నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. కేవ‌లం మూడు నెల‌ల్లో రామమందిర నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోనే రామ మందిర నిర్మాణం జ‌రిగి, హిందువులు శ్రీరామనవమి వేడుకలు జ‌రుపుకుంటార‌ని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News