: వీహెచ్ ను పోలీసులతో కోర్టు బయటకు పంపించిన హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతకు హైకోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వీసీని మార్చాలని వీహెచ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై విచారించిన న్యాయస్థానం, హెచ్సీయూలోకి బయటి వ్యక్తులు ఎందుకు ప్రవేశించారని ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, యూనివర్సిటీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా వీహెచ్ న్యాయస్థానంలో తన వాదన వినిపించేందుకు సమాయత్తమై నేరుగా జడ్జి ముందు తన వాదన వినిపించడం మొదలు పెట్టారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసుల సాయంతో ఆయనను కోర్టు బయటకు పంపించారు. అనంతరం ఈ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేశారు.