: 10 నిమిషాల స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌కు క‌త్రినా పారితోషికం ఆరుకోట్లు!


ఇటీవల ఐపీఎల్‌ ప్రారంభోత్సవం రోజున బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ చేసిన బెల్లీ డ్యాన్స్ అభిమానులంద‌రినీ విప‌రీతంగా అల‌రించిన‌ విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు చేసిన డ్యాన్స్ అభిమానుల‌ మతి పోగొట్టేసింది. అయితే, ఐపీఎల్ ప్రారంభోత్స‌వంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఈ ప‌దినిమిషాల స్టేజ్ పర్‌ఫార్మెన్స్ కి కత్రినా తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..? అక్ష‌రాలా ఆరు కోట్ల రూపాయలని తెలుస్తోంది. కేవ‌లం ప‌దినిమిషాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇంత మొత్తంలో పారితోషికం అందుకున్న మొద‌టి హీరోయిన్‌గా క‌త్రినా రికార్డు నెల‌కొల్పింది.

  • Loading...

More Telugu News