: డిస్ట్రిబ్యూటర్లు అలాంటి వారు కాదు...పూరీ అలా చేసి ఉండరు: నిర్మాత సి.కల్యాణ్


ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా డిస్ట్రిబ్యూటర్లపై ఫిర్యాదు చేసి ఉండరని నిర్మాత సి.కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూటర్లు పూరీ జగన్నాథ్ పై దాడికి పాల్పడే వ్యక్తిత్వం కలవారు కాదని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కాలంగా పరిశ్రమలో ఉన్నారని, వారి మంచితనంతో నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకున్నారే తప్ప దాడులకు పాల్పడలేదని ఆయన తెలిపారు. పూరీ, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య అవగాహనాలోపం కారణంగా సమస్య ఏర్పడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కాగా, 'లోఫర్' సినిమా పంపణీ చేయడం ద్వారా తాము నష్టాల్లో కూరుకుపోయామని, 20 శాతం నష్టాన్ని భర్తీ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అలాంటి ఒప్పందం ఏదీ లేదని పూరీ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లపై పూరీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News