: ఇరాన్ పర్యటనలో సుష్మా స్వరాజ్ డ్రెస్ వివాదం... మండిపడుతున్న నెటిజన్లు


భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల ఇరాన్ పర్యటనలో తాను ధరించిన డ్రెస్సు తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. టెహ్రాన్ లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో పాల్గొన్న తుది సమావేశంలో సుష్మా స్వరాజ్ ముస్లిం మహిళల తరహాలో తన తలను వస్త్రంతో కప్పుకొని ఉండటం హిందూ సంప్రదాయం కాదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ మేరకు పలు విమర్శలతో కూడిన ట్వీట్లతో పాటు సుష్మ, రౌహానీల సమావేశపు ఫొటోను పోస్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ చీర ధరించి, హిందూ సంప్రదాయబద్ధంగా తలపై కప్పుకుని ఉంటే బాగుండేదని ఒకరు, ఇరానీలు లేదా సౌదీ అరేబియా డిప్లమాట్స్ హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై కుంకుమ పెట్టుకుంటారా? అని మరొకరు, ముస్లిం మహిళల తరహాలో సుష్మా స్వరాజ్ డ్రెస్సు ధరించడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఇంకొకరు... ఇలా పలు ట్వీట్లలో ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం గత శనివారం ఆమె ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఆయిల్ దిగుమతులకు సంబంధించిన వ్యాపార ఒప్పందాలను మెరుగు పరచుకునేందుకుగాను ఆమె ఈ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News