: ఎవరేమనుకున్నా నాకు అనవసరం...వారందర్లోకీ ధోనీ బెస్టు: నెహ్రా
1999లో టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించేందుకు సెలెక్ట్ అయ్యానని, అప్పటి నుంచి భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నానని టీమిండియా టీట్వంటీ స్పెషలిస్టు బౌలర్ ఆశిష్ నెహ్రా (37) తెలిపాడు. అజహరుద్దీన్ మొదలుకుని ధోనీ వరకు చాలా మంది కెప్టెన్లతో కలిసి ఆడానని నెహ్రా గుర్తు చేశాడు. వారందరిలోకి ఒత్తిడిని ఎదుర్కోవడంలో ధోనీయే ఉత్తమ కెప్టెన్ అని నెహ్రా పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం తన తప్పిదమని నెహ్రా చెప్పాడు. 2009లో కిర్ స్టెన్, 'ధోనీ టెస్టుల్లో పునరాగమనం చేస్తావా?' అంటూ తనను అడిగినప్పుడు వారికి సమాధానం చెప్పడంలో నిర్లక్ష్యం ప్రదర్శించానని నెహ్రా అంగీకరించాడు. తన ఆటతీరుపై మీడియా వార్తలను పట్టించుకోనని నెహ్రా తెలిపాడు. తాను మీడియాకు దూరంగా ఉంటానని, తనకు తన ఆటగురించి తప్ప ఇతర విషయాలపై శ్రద్ధ లేదని నెహ్రా స్పష్టం చేశాడు.