: చందర్లపాడులో దారుణం...14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య


కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని విభరింతలపాడులో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికను జాన్ బాషా, అతని స్నేహితులు ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన సదరు బాలిక, ఈ మధ్యే ఓ కంపెనీలో జాయిన్ అయింది. విధులు నిర్వర్తించి ఇంటికి వస్తున్న బాలికను అటకాయించిన నిందితులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అటుగా మనుషులు వస్తున్న అలికిడి కావడంతో ఆమెపై యాసిడ్ పోసి హత్య చేసి, పరారయ్యారు. ఆ తర్వాత అటుగా వచ్చిన గ్రామస్థులు బాలికను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News