: ఐఎస్ఐఎస్‌పై పోరాటం.. 20 నెలల్లో 25 వేల మంది ఉగ్రవాదుల హతం
ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసే దిశగా బ్రిటన్, దాని మిత్ర దేశాలు గత 20 నెలలుగా సాగిస్తోన్న పోరాటంలో ఇప్పటి వరకు 25 వేల మందికి పైగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతమైనట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న సిరియా, ఇరాక్ లలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా ఐఎస్ఐఎస్ పై జరుపుతోన్న పోరాటంలో ఉగ్రవాదులు తేరుకోలేని దెబ్బతిన్నారని పేర్కొన్నారు. మరో వైపు గత కొన్ని నెలలుగా అమెరికా, సంకీర్ణ సేనలు జరుపుతోన్న దాడుల్లోనూ 100మంది ఐఎస్ఐఎస్ నేతలు హతమైనట్లు పేర్కొన్నారు.