: ఈ దేశాల్లో భార్యను హింసించడం సబబే అంటున్న మహిళలు!


మహిళలను హింసకు గురిచేయడం సరికాదని ఐక్యరాజ్యసమితి 40 ఏళ్ల క్రితమే తీర్మానం చేసింది. అయితే భార్యను కొన్ని సందర్భాల్లో హింసకు గురి చేయడం సబబేనని పలు దేశాల్లో మహిళలు అంగీకరించారు. వివరాల్లోకి వెళ్తే...ఆగ్నేయ ఆసియాలోని తూర్పు తిమోర్ లో ఆడవాళ్లను గృహహింసకు గురిచేయడం సబబేనని 81 శాతం మంది టీనేజ్ అమ్మాయిలు అభిప్రాయపడడం విశేషం. తరువాతి స్థానాల్లో కిరిబాటి, సాల్మన్ ఐలాండ్స్, ఇథియోపియా, భూటాన్ వంటి దేశాల్లో మహిళలపై గృహహింస తప్పుకాదని పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల్లో కొన్ని సందర్భాల్లో మహిళలపై గృహహింస తప్పుకాదని కొంత మంది యువతులు పేర్కొన్నారు. 71 శాతం మహిళలు గృహహింసకు గురవుతున్న ఇథియోపియాలో భర్త, భార్యను కొట్టడం తప్పుకాదని 68.8 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. వంట చేసేటప్పుడు కూర మాడిస్తే కొట్టకుండా ఏం చేస్తారని వారు ఎదురు ప్రశ్నించారు. ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 51 శాతం మంది యువతులు 21 శాతం మంది టీనేజ్ అబ్బాయిలు గృహహింస సబబేనని పేర్కొనడంపై ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. పురుషాధిక్యం నుంచి సంక్రమించిన గృహహింసను సమాజం ఇప్పటికీ ఆమోదించడం విస్మయానికి గురిచేస్తుందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే గృహహింస తగ్గుముఖం పట్టిందని, అవిద్య, నిరుద్యోగం, వంశపారంపర్యంగా వచ్చిన గృహహింస ఇంకా కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. త్వరలోనే ఈ దేశాల్లో అవగాహన పెరిగి గృహహింస పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఐక్యరాజ్యసమితి ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News