: విజయ్ కాంత్ కు ఒంట్లో బాగోలేదు.. అందుకే, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు: నటి రాధిక


అనారోగ్యంతో బాధపడుతున్న డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని సమత్వ మక్కల్ కట్చి మహిళా విభాగపు అధ్యక్షురాలు, సినీ నటి రాధిక విమర్శించారు. కెప్టెన్ విజయ్ కాంత్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్నారు. తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమిలోని సమత్వ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శరత్ కుమార్ భార్య రాధిక మాట్లాడుతూ, డీఎంకే కుటుంబ రాజకీయాలపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలు కాక తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన సాగిస్తున్న అన్నా డీఎంకే పార్టీ తన హయాంలో ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అన్నాడీఎంకు చేసిన మంచి పనులే శరత్ కుమార్ ను గెలిపిస్తాయని రాధిక పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News