: జూపల్లిని పిల్లి అన్న డీకే అరుణ!... మాజీ మంత్రిపై చైతన్యపురి పీఎస్ లో అడ్వొకేట్ జేఏసీ కంప్లైంట్


టీఆర్ఎస్ నేత, మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే... నిన్న హైదరాబాదులోని గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా తన సొంత జిల్లా పాలమూరుకు చెందిన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆమె పిల్లిగా అభివర్ణించారు. ఈ విషయం తెలుసుకున్న అడ్వొకేట్ జేఏసీ నాయకులు భగ్గుమన్నారు. నేటి ఉదయం చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జేఏసీ నేతలు డీకే అరుణపై ఫిర్యాదు చేశారు. ప్రజలతో ఎన్నుకోబడి, మంత్రి హోదాలో కొనసాగుతున్న జూపల్లిపై డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News